Tammineni Sitaram: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం

శ్రీకాకుళం అర్బన్‌: విద్యతోనే పేదరిక నిర్మూలన, సామాజిక మార్పు సాధ్యమవుతుందని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

జేఎన్‌టీయూ విజయనగరం పాలకమండలి సభ్యుడిగా దుప్పల వెంకటరావును ప్రభుత్వం నియమించిన సందర్భంగా న‌వంబ‌ర్‌ 19న‌ శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోని ఆనందమయి కన్వెన్షన్‌ హాల్‌లో గాయత్రి విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు అధ్యక్షతన దుప్పల వెంకటరావును ఆత్మీయంగా సత్కరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందుతోందని స్పీకర్‌ అన్నారు.

వివాద రహితునిగా పేరున్న దుప్పల వెంకటరావును జేఎన్‌టీయూ విజయనగరం పాలకమండలి సభ్యునిగా ప్రభుత్వం నియమించడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌ వి డుదల చేసినట్లు తెలిపారు. అన్ని రంగాలపై దుప్ప ల వెంకటరావుకు అవగాహన ఉందని, అలాంటి వ్యక్తికి పాలకమండలి సభ్యునిగా నియమించడం హర్షణీయమన్నారు.

చదవండి: Technical Education: సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్‌

జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావు తదితరులు మాట్లాడుతూ విద్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో తనదైన ముద్రవేసి అందరివాడుగా పేరుపొందిన దుప్పల వెంకటరావుకు పాలకమండలి సభ్యునిగా ప్రభుత్వం నియమించడం సంతోషకరమన్నారు.
దుప్పల వెంకటరావు మాట్లాడుతూ తన ఉన్న తికి తల్లిదండ్రులే కారణమని అన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుండ అప్పలసూర్యనారాయణ, కూన రవికుమార్‌, గుండ లక్ష్మీదేవి, నగర ప్రముఖులు డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, డాక్టర్‌ కేఎల్‌ నాయుడు, డాక్టర్‌ పైడి మహేశ్వరరావు, హనుమంతు కృష్ణారావు, గుంట తులసీరావు, చౌదరి పురుషోత్తమనాయుడు, దుప్పల రవీంద్రబాబు పాల్గొన్నారు.

#Tags