Jishnu Dev Varma: స్వదేశీ మేళాలతో స్వయం సమృద్ధి

ఖైరతాబాద్‌: స్వదేశీ జాగరణ మంచ్‌, స్వావలంబన భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో నగరంలోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన స్వదేశీ మేళాను అక్టోబర్ 23న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ అనేది మన స్వయం సమృద్ధితో పాటు దేశ ఆత్మనిర్భరతను అన్ని రంగాల్లో సాకారం చేసే అద్భుత తారకమంత్రమన్నారు.

మూడు దశాబ్దాలుగా స్వదేశీ జాగరణ మంచ్‌ నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలతో స్థానిక కళాకారులు, ఉత్పత్తులు, వ్యాపారులను అమితంగా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనమే కాకుండా కుటుంబం తద్వారా గ్రామం, రాష్ట్రం, దేశం మొత్తం స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు. 

చదవండి: Artificial Intelligence : డిజిటల్‌ యుగంలో అన్ని రంగాలకు విస్తరిస్తున్న కృత్రిమ మేథ.. భవిష్యత్‌లో భారీగా కొలువులు!

స్వదేశీ భావజాలం, స్వదేశీ విధానాలు బలపడిన కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి అగ్రగామిగా నిలవడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఆదర్శమవుతుందన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

334 స్టాళ్లలోని ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్‌ జాతీయ కన్వీనర్‌ సీఏఆర్‌ సుందరం, తెలంగాణ ప్రాంత కన్వీనర్‌ హరీశ్‌ బాబు, గంగోత్రి డెవలపర్స్‌ చైర్మన్‌ మధురాం రెడ్డి, భారత్‌ అభియాన్‌ ప్రాంత కన్వీనర్‌ జి.రమేష్‌ గౌడ్‌, స్వదేశీ మేళా కన్వీనర్‌ ఇంద్రసేన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ మేళా అక్టోబర్ 27 వరకు అందుబాటులో ఉంటుంది.

#Tags