ఓయూకు నూతన వీసీ ఎంపికపై కసరత్తు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూకు వచ్చే (మే) నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవీ కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైరెన అధ్యాపకులు.

కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొ.రవీందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణతో పాటు గతంలో వీసీలుగా, ఇతర అధికారులుగా పనిచేసి సీనియర్‌ అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రొఫెసర్ల వివరాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. మాజీ వీసీ ప్రొ.డీసీ రెడ్డి తర్వాత 25 ఏళ్లుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధ్యాపకులకు వీసీగా అవకాశం దక్కలేదు.

గత 25 ఏళ్లలో వెలమ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన అధ్యాపకులు వీసీలుగా పని చేశారు. ఇదిలా ఉండగా 107 ఏళ్ల ఓయూకు ఇంత వరకు ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు వీసీలుగా నియమించలేదు.

చదవండి: OU Annual Budget: ఓయూ వార్షిక బడ్జెట్‌ విడుద‌ల‌.. రూ.500 కోట్లు సరిపోవడం లేదు

సామాజిక న్యాయంలో భాగంగా ఈ సారీ ఎస్సీ లేదా ఎస్టీలకు ప్రొఫెసర్లకు వీసీ పదవి దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. వీసీ పదవికి దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌, దూరవిద్య డైరెక్టర్‌ ప్రొ.జీబీ రెడ్డి, కామర్స్‌ సీనియర్‌ ప్రొ.అప్పారావు, పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొ.పాండురంగా రెడ్డి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ తదితరులతో పాటు విశ్రాంత ప్రొఫెసర్లు, పలువురు మాజీ వీసీలు, రిజిస్ట్రార్లు ఉన్నారు.

#Tags