Virinchi Swapnika: ఏషియన్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక

కరీంనగర్‌స్పోర్ట్స్‌: షార్జాలో ఈ నెల 16 నుంచి 21వరకు జరుగనున్న ఏషియన్‌ యూనివర్సిటీ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న ఆర్‌.విరించి సప్నిక ఎంపికై ంది.
ఏషియన్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక

జూన్‌ 6 నుంచి 21 వరకు జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన ఆల్‌ ఇండియా యూనివర్సిటీ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 4వ స్థానం సాధించి ఏషియన్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపికై ంది. స్వప్నికను శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎస్‌.మల్లేశం, స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి నజీరుద్దీన్‌, ప్రొఫెసర్‌ ప్రభాకర్‌రావు, ఎస్సారార్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కలువకుంట్ల రామకృష్ణ, ఫిజికల్‌ డైరెక్టర్లు నాగేశ్వర్‌రావు, విజయ్‌కుమార్‌ అభినందించారు.

చదవండి:

Velugu Abhyasamithra: విద్యార్థుల్లోని సామర్థ్యాలు వెలికితీయాలి: నోడల్‌ అధికారి వెంకటయ్య

UP స్కూలు టీచర్‌ వినూత్న ప్రయత్నం: ‘ప్యాడ్‌ బ్యాంక్‌’

#Tags