School Holidays Extended 2024 : గుడ్ న్యూస్.. స్కూల్స్‌కు జూన్ 25వ తేదీ వ‌ర‌కు సెల‌వులు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్ విద్యార్థుల‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్ప‌టికి ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్ర‌త త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులను పొడిస్తున్నారు.

తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎండలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.

రాబోయే నాలుగు రోజుల పాటు..

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు వర్తిస్తుంద‌న్నారు. వాస్తవానికి  ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే ఎంత తీవ్ర‌త కార‌ణంగా ఈ వేస‌వి సెల‌వుల‌ను పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను  జూన్ 25 వరకు పొడిగించింది. జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

☛ July 27, 28th Holidays : జూలై 27వ తేదీన‌ సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కార‌ణం ఇదే..

ఈ రాష్ట్రంలో కూడా..
దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప్ర‌స్తుతం వేస‌వి తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంది. దీంతో పిల్ల‌ల ఆరోగ్యం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని.. UP Director of Basic Education Council Pratap Singh Baghel స్కూల్స్‌కు వేస‌వి సెల‌వుల‌ను జూన్ 24వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. తిరిగి ఈ స్కూల్స్ జూన్ 25వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

#Tags