AP Sankranti Holidays Extended: ఏపీలో సంక్రాంతి సెలవుల పొడగింపు.. కొత్త తేదీలివే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది ప్రకటించిన అకడమిక్ సెలవుల క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవుల్ని జనవరి 11 నుంచి 16 వరకూ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయించింది. అయితే సంక్రాంతి సెలవుల్లో మార్పుకు సంబంధించి ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. జనవరి 17వ తేదీ ముక్కనుమ ఉన్న నేపథ్యంలో సెలవుల్ని 12 నుంచి 18వ తేదీకి మార్పు చేశారు. 19వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
#Tags