Covid Effect: కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా

కరోనా విజృంభణతో తెలంగాణ‌ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి.
కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా

కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

జేఎన్ టీయూ పరిధిలో...

కేపీహెచ్‌బీ కాలనీ: జేఏన్ టీయూహెచ్‌లో జరగనున్న అన్ని పరీక్షలను జనవరి 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజి్రస్టార్‌ డాక్టర్‌ యం. మంజూర్‌ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 

ఓయూలో పరీక్షలు రద్దు..

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో జనవరి 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజి్రస్టార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ జనవరి 17న పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలతో పాటు ఇంటర్నల్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

చదవండి: 

Good News: ఈ విద్యార్థులకు ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు.. మంత్రివర్గం ఆమోదం..

ఇంజనీర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పేశా.. తదేక దీక్షతో ఐఏఎస్ సాధించా : కలెక్టర్ వినయ్‌చంద్

#Tags