Dr. Subodh: ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవం
National Nutrition Week 2022... మంచి పోషకాహారం, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ సందర్భంలో Dr Kakarla Subba Rao Centre for Health Care Management ASCI, PGDHM విదార్థులు, ఉపాధ్యాయులు, డాక్టర్. సుబోధ్ గారి (ప్రోగ్రాం డైరెక్టర్) ఆధ్వర్యంలో, వివిధ కార్యక్రమాలు, అవగాహన కార్యకలాపాలు రంగారెడ్డి జిల్లా లోయపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాశాలలో నిర్వహించారు.
పోషకాహార లోపం వల్ల చట చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిణామాల గురించి, తీసుకోవాలసిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించి, ఆరోగ్యం, పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
#Tags