NI msmeలో MBA ఎంఎస్‌ఎంఈ మేనేజ్‌మెంట్ కోర్సు
పంజగుట్ట (హైదరాబాద్): భారత ప్రభుత్వ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంఎస్‌ఎంఈ (నిమ్స్‌మే) ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ఏఎస్‌బీఎం యూనివర్సిటీ సహకారంతో ఎంబీఏ ఎంఎస్‌ఎంఈ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ ఎస్.గ్లోరీ స్వప్న తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మే 9న కోర్సు కరపత్రాన్ని ఏఎస్‌బీఎమ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు బిస్వజిత్ పట్నాయక్, నిమ్స్‌మే ఫ్యాకల్టీ మెంబర్ దిబ్యందు చౌదరి, యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిరంజనలతో కలిసి ఆవిష్కరించారు. దరఖాస్తుల గడువు మే 30వ తేదీ అని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
చదవండి:
Btech Seats: ఎస్‌టీ విద్యార్థులకు సీట్లను పెంచిన తెలంగాణ... ఈ ఏడాది నుంచే అమలు
AP ICET 2023 Notification: ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
#Tags