National Science Day: ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం.. 220 సైన్స్‌ ఎగ్జిబిట్లు

జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్‌ రోడ్డు ఏకశిల పబ్లిక్‌ స్కూల్‌లో ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత సర్‌ సీవీ రామన్‌ ప్రతిపాదించిన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకుని సైన్స్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఏకశిల విద్యా సంస్థల సెక్రటరీ చిర్ర ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ రామ్‌, టస్మా రాష్ట్ర అడ్వైజర్‌ ఇ.ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్‌ కల్నల్‌ డాక్టర్‌ భిక్షపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 450 మంది విద్యార్థులు వివిధ రకాల 220 సైన్స్‌ ఎగ్జిబిట్లును ప్రదర్శించారు.

అంతకు ముందు విద్యార్థులు సైన్స్‌ సెమినార్‌ ప్రజెంటేషన్‌, సైన్స్‌ క్విజ్‌ పోటీలు, సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లు, సైన్స్‌ క్వెస్ట్‌–2022 గ్యాలరీ షో నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ సి.ఇందిర చేతుల మీదుగా మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సైన్స్‌ డేను విజయవంతంగా నడిపించిన ఉపాధ్యా బృందాన్ని ఉపేందర్‌రెడ్డి అభినందించారు.

చదవండి: Life Sciences Hub: లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌

అలాగే పట్టణంలోని నెహ్రూపార్కు ఏరియా సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌లో సైన్స్‌ డేను ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపాల్‌ ఎన్‌.మరియా జోసెఫ్‌ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో జరిగాయి. పాఠశాలలో నెలకొల్పిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు.

మాక్‌ జెడ్పీ ప్రదర్శనలో ప్రతిభ

జనగామ రూరల్‌: రాష్ట్ర స్థాయి జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండలోని పింగళి మహిళా కళాశాలలో దేవరుప్పుల జెడ్పీఎస్‌ఎస్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మాక్‌ జెడ్పీ ప్రదర్శన చేపట్టి హనుమకొండ కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు.

#Tags