Life Sciences Hub: లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రగతిశీల విధానాల ద్వారా ప్రపంచంలోనే తయారీ, లైఫ్‌సైన్సెస్ రంగంలో ఉద్యోగాలకు చిరునామాగా నిలిచింది. ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు 2047 ప్రణాళికతో భారత్ అనేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని బలమైన పారిశ్రామిక వాతావరణం, స్థిరమైన ప్రభుత్వం, అనుకూల విధానాలతో ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి’అని ఎలి లిల్లీ సీఈవో డేవిడ్ రిక్స్ పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు 2024 చివరి రోజు సమావేశాల్లో భాగంగా రిక్స్ కీలకోపన్యాసం చేశారు.
చదవండి: Bio Asia Summit: రూ.లక్ష కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి.. 5 లక్షల మందికి ఉద్యోగాలు
‘‘దేశీయ ఆవిష్కరణలను ప్రపంచీకరణ చేయ డంలో భారతీయ కంపెనీలు ముందుకు రాకపోవడం అతిపెద్ద లోపం. భారత్‌లో ప్రస్తుతం డయా బెటిస్ అతిపెద్ద సమస్య కాగా ఈ విషయంలో త్వరలో చైనాను కూడా అధిగమించబోతోంది. మ రోవైపు భారత్‌లో ఆరోగ్య బీమా అనేది ప్రాథమిక స్థాయిలోనే ఉంది. అయితే భారత్‌లో నైపుణ్యానికి కొదవలేదు’అని డేవిడ్ రిక్స్ పేర్కొన్నారు.
కొత్త చికిత్స విధానాలు: జెఫ్ మార్తా
‘సాంకేతిక పురోగతి సాధించిన కొద్దీ నూతన చికిత్సా విధానాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. దీంతో ఆరోగ్య రక్షణ రంగంలో ‘మెడ్‌టెక్’(వైద్య సాంకేతికత)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో చికిత్సలో మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డీప్ లెర్నింగ్ (డీఎల్) సాంకేతిక ఆధారిత ఉపకరణాల వినియోగం పెరగడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రాధాన్యత కూడా పెరుగుతోంది’అని మెడ్‌ట్రానిక్స్ చైర్మన్, సీఈఓ జెఫ్ మార్తా పేర్కొన్నారు.
చదవండి: Intuitive Machines: అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు.. ఆచితూచి అడుగేద్దాం!!
‘డేటా, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, 5జీ, 10జీ రోబోటిక్స్ వంటివి వైద్య ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. సర్జికల్ రోబోటిక్స్ విధానంలో అమెరికాలో 20 శాతం, ప్రపంచ వ్యాప్తంగా 5శాతం సర్జరీలు జరుగుతుండగా, భారత్‌లో మాత్రం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. రోబోటిక్ సర్జరీల కోసం వైద్యులకు అత్యున్నత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది’’అని జెఫ్ మార్తా వ్యాఖ్యానించారు.