ANUలో 11, 12 తేదీల్లో జాతీయ సదస్సు

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు పోస్టర్‌ను న‌వంబ‌ర్‌ 25న వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రెక్టార్‌ ఆచార్య కె. రత్నషీలామణి, రిజిస్ట్రార్‌ ఆచార్య జి. సింహాలచంం తదితరులు ఆవిష్కరించారు.

సదస్సు డైరెక్టర్‌ డాక్టర్‌ డి. రవిశంకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎ. ప్రమీలారాణి వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 11, 12 తేదీలలో ‘ ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధిలో బహుళ విభాగ పరిశోధన’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సదస్సుకు ముఖ్య ప్రసంగీకులుగా జబల్‌పూర్‌ మంగళమాటన్‌ యూనివర్సిటీ వీసీ ఆచార్య కేఆర్‌ఎస్‌ సాంబశివరావు హాజరు కామన్నారని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఐ. బాలకృష్ణ, కేరళలోని త్రివేండ్రం రీజినల్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి డాక్టర్‌ బి. చంద్రశేఖరన్‌, బెంగళూరులోని ఆల్‌ అమీన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎండీ సల్లాహుద్దీన్‌, హైదరాబాద్‌ నల్ల నరసింహారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్సి్‌ూట్యషన్స్‌ డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌. కృష్ణమోహన్‌ హాజరై ఉపన్యాసాలు చేస్తారని పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మేడికొండూరులోని కేసిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌ కో స్పాన్సర్‌గా ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. కన్వీనర్‌గా డాక్టర్‌ అన్నపూర్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ కె. సుజనా, కోశాధికారిగా డాక్టర్‌ కె.ఈ. ప్రవల్లిక, జాయింట్‌ ఆర్గనైజేషన్‌ సెక్రటరీగా డాక్టర్‌ షేక్‌ మస్తానమ్మ, కె. విజయ్‌ కిషోర్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ పి. రవి, డాక్టర్‌ ఎం. గాయత్రి రమ్య, ఎంఏఎం ఫార్మసీ కళాశాల చైర్మన్‌ ఎం. శేషగిరిరావు పాల్గొన్నారు.

#Tags