National Best Teacher Awards: ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం.. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులకు సెప్టెంబ‌ర్ 5న‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023కుగాను ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించారు.
రాష్ట్రపతి నుంచి అవార్డు స్వీకరిస్తున్న అర్చన, సంతోష్‌ కుమార్, దిబ్యేందు చౌదరి, ఆంజనేయులు, మురహరరావు ఉమా గాంధీ, మేకల భాస్కర్‌రావు. చిత్రంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

 ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన అర్చన నూగురి, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సంతోష్‌ కుమార్‌ భేడోద్కర్‌లు అవార్డులు అందుకోగా కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌–ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ శాఖ అందించే ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీలో హైదరాబాద్‌ ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ ఫ్యాకల్టీ డాక్టర్‌ దిబ్యేందు చౌదరి కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

చదవండి: National Teachers Day: ఉత్తమ ఉపాధ్యాయులుగా 28మంది

అలాగే ఏపీ నుంచి ప్రా«థమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో నెల్లూరుకు చెందిన మేకల భాస్కర్‌రావు, విశాఖపట్నం శివాజీ పాలెంకు చెందిన మురహరరావు ఉమా గాంధీ, రాయచోటికి చెందిన సెట్టెం ఆంజనేయులు అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం పాల్గొన్నారు.  

చదవండి: Sunitha Rao: బడి... బిడ్డను విద్యార్థిగా మార్చే అక్షరాల ఒడి

#Tags