MBBS: విద్యార్థినికి ఎంపీ ఆర్థికసాయం

నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మాధవనగర్‌ ప్రాంతానికి చెందిన ఊట్కురి రుక్కయ్య కూతురు శ్రీలక్ష్మి ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి.
విద్యార్థినికి ఆర్థికసాయం అందిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈ విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. శ్రీలక్ష్మి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు మొదటగా రూ.లక్షా యాభై వేలు నవంబర్‌ 14న హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు.

చదవండి: PM-YASAVI Scheme: 15000 పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. అర్హతలు ఇవే..

ఎంపీ కోమటిరెడ్డి తమకు దేవుడిలా సహాయం అందించారని, తమ కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని రుక్కయ్య అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎంబీబీఎస్‌ విద్యార్థిని శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: Shriya Sai Success Story : ఈ విద్యార్థికి రూ.2.7 కోట్ల స్కాలర్‌షిప్‌.. ఇలా ప్లాన్ చేస్తే మీకైనా ఈజీనే..

#Tags