Model School Entrance Exam: 16న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ఆదిలాబాద్: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈ నెల 16న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో టి.ప్రణీత ప్రకటనలో తెలిపారు.
ఆరో తరగతి విద్యార్థుల కోసం జిల్లాలో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు 1696 మంది హాజరుకానున్నట్లు తెలిపా రు. 7నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1235 విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఆరో తరగతి వి ద్యార్థులకు ఉదయం 10నుంచి 12గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్నా హ్నం 2నుంచి 4గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
#Tags