Space Week 2024: అంతరిక్షాన్ని చూసేద్దాం!.. స్పేస్‌ వీక్‌–2024

తిరుపతి(అలిపిరి): తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో జూలై 17న‌ నగరపాలక కమిషనర్‌ అదితిసింగ్‌ చేతుల మీదుగా సరికొత్త ప్రదర్శనతో డిజిటల్‌ ప్లానిటోరియాన్ని పునఃప్రారంభించారు.

చంద్రునిపై మానవుడు అడుగుపెట్టిన సందర్భంగా స్పేస్‌ వీక్‌–2024 పేరిట జూలై 17న‌ నుంచి 23వ తేదీ వరకు ఇక్కడ వివిధ పోటీలు నిర్వహణకు శ్రీకారం చుట్టారు. చారిత్రాత్మక శ్రీమ్యాన్‌ ల్యాండింగ్‌ మిషన్ఙ్‌ ప్రాముఖ్యతను.. మానవ జాతి అభివృద్ధికి మిషన్‌ను విజయవంతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసిన శాసీ్త్రయ సమాజం ప్రయత్నాలను అదితి సింగ్‌ వివరించారు.

పట్టుదల, విజయవంతం కావాలని.. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉండాలన్నారు. అనంతరం 25 నిమిషాల నిడివి గల ‘ది సన్‌ అవర్‌ లివింగ్‌ స్టార్‌’ పేరుతో కొత్త ప్లానిటోరియం షోను ప్రారంభించారు.

చదవండి: Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఈ సమస్యలే కారణం!!

విద్యార్థులతో కలిసి ప్రదర్శనను వీక్షించారు. అంతరిక్ష శాస్త్రంపై మెరుగైన అవగాహన కోసం ఇలాంటి షోలు చూడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సైన్సు సెంటర్‌ చేస్తున్న కృషిని అభినందించారు. రోజుకు 5 షోలు ప్రదర్శించనున్నట్టు కేంద్రం కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస నెహ్రూ చెప్పారు.

తొలిరోజు 600మంది విద్యార్థులు షోను వీక్షించారని తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పురుషోత్తం, కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
 

#Tags