10th & Inter: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫీజు గడువు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: ఓపెన్‌ స్కూల్‌ ద్వారా టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయాలనుకునే వారు ఆగ‌స్టు 22 నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ పీజీ శ్రీహరి తెలిపారు.

ప్రతీ పేపర్‌కు రూ.25 అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 9 వరకు ఫీజు చెల్లించాలని వెల్లడించారు.

చదవండి: Best Education: ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ విద్య

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగుతాయన్నారు. వివరాలకు http://www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

#Tags