Guest Lecturers: గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలి
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: ప్రభుత్వ జూనియర్ కళా శాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెన్యూవల్ చేయాలని ఆ సంఘం రా ష్ట్ర కమిటీ సభ్యుడు వేణుయాదవ్ డిమాండ్ చేశారు.
ఆగస్టు 15న డీఐఈవో రవీందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు డీఐఈవోను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. 2012 నుంచి జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న తమ సర్వీస్ ను రెన్యూవల్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
చదవండి: Guest Faculty Jobs: ప్రభుత్వ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..
మేనిఫెస్టోలో చెప్పినట్లు 12నెలల వేతనం రూ.42వేలతో చెల్లించా లని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బదిలీల్లో భా గంగా తమ స్థానాన్ని కోల్పోయిన లెక్చరర్లకు వారి మల్టీజోన్‌లో సర్దుబాటు చేయాలని, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి సర్వీస్‌ను ప్రభుత్వ కళాశాలల్లో కొనసాగించేలా చూడాలని కోరారు. స్పందించిన డీఐఈవో సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
Published date : 16 Aug 2024 12:30PM