July 20, 21st Schools Holidays 2023 Due to Rain : నేడు, రేపు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌ల‌కు రెండు రోజులు పాటు సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.
Schools and Colleges Holidays News 2023

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి జూలై 20, 21వ తేదీల్లో (గురువారం, శుక్ర‌వారం) సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. ఒక వేళ ఈ వ‌ర్షాలు  ఇలాగే కొన‌సాగితే.. వర్షాలు ప‌డే ప్రాంతం బ‌ట్టి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సెల‌వుల‌తో ఇప్ప‌టికే స్కూల్స్ చేరుకున్న విద్యార్థులు ఇంటి బాట ప‌ట్టారు.

☛ August 29, 30 Schools and Colleges Holidays : ఆగస్టు 29,30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు.. 
భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నేడు అనగా గురువారం కూడా ముంబైకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారు లను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు. 

అలాగే తెలంగాణ రాష్ట్రమంతటా మూడు రోజులుగా వాన ముసురుకుంది. మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగుతాయని వాతా­వ­రణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలరోజులైనా వానలుపడక నెలకొన్న లోటు అంతా తీరిపోతోంది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఏకంగా 20 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. బుధవారానికి ఇది ఐదు శాతానికి తగ్గింది.

నైరుతి సీజన్‌లో ఏటా ఈ సమయం వరకు 25.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 24.48 సెంటీమీటర్లకు చేరింది. మరో రెండ్రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండటంతో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. 3 జిల్లాల్లో అధికంగా, 23 జిల్లాల్లో సాధారణ, 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

➤ అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు : సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌

➤ సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు : 
ఆదిలా­బాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జన­గామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కా­జిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, నారాయణపేట, జయశంకర్‌ భూపాలపల్లి

➤ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు : 
మహబూ­బాబాద్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం

8 జిల్లాలకు మాత్రం..
పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలు, ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని వల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని తెలిపింది.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలో..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో.. గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు పరవళ్లు తొక్కుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ­(లక్ష్మి) బ్యారేజీలోకి ప్రాణహిత నుంచి 5,41,430 క్యూసెక్కుల వరద వస్తుండగా.. గేట్లు ఎత్తి 5,25,250 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

దీనికి ఇంద్రావతి వరద తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 6,53,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత శబరి, ఇతర వాగుల ప్రవాహాలు కలిసి గోదావరి వరద పోలవరం వైపు పరుగుపెడుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 11 గంటలకు గోదావరి వరద 35.07 అడుగులకు చేరింది.

వానలు కొనసాగుతుండటంతో ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఎగువ గోదావరిలోనూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 33,760 క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ 33.34 టీఎంసీలకు చేరింది.

ప్రజల తిప్పలు..
ఎడతెరిపి లేని ముసురు, వానలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నెలలు నిండిన గర్భిణులను సమీపంలోని సామాజిక ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు.

వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వెంకటాపురం(కె) మండలంలో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రధానకాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది.  

ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండ‌డీ(IMD) జూలై 20 , 21, 2023 తేదీలలో తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరికను జారీ చేసింది.

జూలై 21 వరకు రాయ్‌గఢ్‌లో ఆరెంజ్ హెచ్చరిక కొనసాగ‌నున్న‌ది. పాల్ఘర్ , థానే జిల్లాలు జూలై 20 వరకు వర్షాలు పడే సమాచారం ఉంది. అధికారులు స్థానికులను ఇంట్లోనే ఉండమని బయటికి వెళ్లకుండా ఉండాలని ప్రోత్సహించారు. యమునా నదికి వరదలు పెరుగుతున్నందున, ఢిల్లీలోని పాఠశాలలు కూడా జూలై 18 వరకు మూసివేసిన విష‌యం తెల్సిందే.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

​​​​​​​తెలంగాణ‌లో 2023-24 సెల‌వులు ఇవే..
☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

#Tags