రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుల దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేట రూరల్‌: మహిళా, శిశు సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి శారద ఆగ‌స్టు 22న‌ ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలు అర్హులని తెలిపారు. సాంస్కృతిక కలలు, క్రీడలు, సమాజ సేవ, పాండిత్యం, సాహస రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలలు సంబంధిత సపోర్టి ంగ్‌ డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: IT Jobs for Inter Students : ఐటీ పరిశ్ర‌మ‌లో ఉద్యోగానికి ప్లేస్మెంట్ డ్రైవ్‌.. ఈ విద్య‌తోనే..!

దరఖాస్తుల నమోదు ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుందని, ఎంపికై న బాలలకు డిసెంబర్‌ 26వ తేదీన వీర్‌ బాల్‌ దివాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. http://awards. gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

#Tags