Free Skill Training: ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎంపికై న వారికి హైదరాబాద్‌లోని కుషాయిగూడలో గల ఎలీ హోప్‌ టెక్నికల్‌ స్కిల్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో 100 మందికి 90 రోజుల పాటు నాన్‌ రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

చదవండి: Free Training: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

శిక్షణ పూర్తయిన తర్వాత అకాడమీ వారే ఉద్యోగాలు కల్పిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 0878–2268686 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

#Tags