Admissions: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

సాక్షి, సిటీబ్యూరో: మైనారిటీ గురుకుల్లాలో 2024– 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మైనారిటీ, మైనారిటీయేతరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్ధల సొసైటీ కార్యదర్శి ఆయేషా మసరత్‌ ఖానం జ‌నవ‌రి 16న‌ఒక ప్రకటనలో తెలిపారు.

204 మైనారిటీ గురుకులాల్లో ఐదో తరగతిలో అన్ని సీట్లు, 6, 7, 8వ తరగతుల్లో ఖాళీ సీట్లతో పాటు 194 జూనియర్‌ కాలేజీలు, 10 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

చదవండి: Jobs: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జ‌నవ‌రి 18 నుంచి వచ్చే నెల 6 వరకు వెబ్‌సైట్‌  www.tmreistelangana.cgg.gov  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం గురుకులాల  ప్రిన్సిపాల్‌ లేదా జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి లేదా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040–23437909లలో సంప్రదించవచ్చని తెలిపారు.   

#Tags