NIRF 2024 Rankings: అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌.. విభాగాల వారీగా ర్యాంకులు ఇలా..

న్యూఢిల్లీ: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్‌ మరోసారి తన సత్తా చాటింది. దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో వరుసగా ఆరోసారి టాప్‌లో నిలిచింది.

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) వరుసగా తొమ్మిదోసారి అత్యుత్తమ విశ్వవిద్యాల యాల జాబితాలో మొదటి స్థానం సొంతం చేసు కుంది. ఆగ‌స్టు 12న‌ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌– 2024 ర్యాంకులను విడుదల చేశారు.

ఈ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)–2024 జాబితాలో టాప్‌ టెన్‌లో ఎనిమిది ఐఐటీలే ఉండటం విశేషం. వీటితోపాటు ఎయిమ్స్‌ న్యూఢిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌ యూ)లకు చోటుదక్కింది.

చదవండి: APSCHE: ఉన్నత విద్యలో నైపుణ్యం, నాణ్యత కీలకం

ఆయా విద్యాసంస్థల్లో అందిస్తున్న విద్యబోధన, మౌలిక సౌకర్యాలు తదితరాల ఆధారంగా మొత్తం 13 విభాగాల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులను ప్రకటించారు. యూని వర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, వైద్య విద్య, డెంటల్‌, లా, అగ్రికల్చర్‌ విభాగాల్లో 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.

విభాగాల వారీగా ర్యాంకులు

  • మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ఐఐటీ మద్రా స్‌ టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో ఐఐ ఎస్సీ బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ బాంబే ఉన్నాయి.
  • యూనివర్సిటీల విభాగంలో.. ఐఐఎస్సీ బెంగ ళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో జేఎన్‌యూ, జామి యా మిలియా ఇస్లామియా ఉన్నాయి.
  • ఇంజనీరింగ్‌ విభాగంలోని టాప్‌ టెన్‌లో తొమ్మి ది ఐఐటీలే ఉన్నాయి. ఐఐటీ మద్రాస్‌ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానం కైవసం చేసుకోగా.. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే నిలిచాయి. నిట్‌ తిరుచిరాపల్లి మాత్ర మే టాప్‌ టెన్‌లోని నాన్‌ ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌.
  • మేనేజ్‌మెంట్‌ విభాగంలో.. ఐఐఎం అహ్మదా బాద్‌ మొదటి స్థానం సొంతం చేసుకుంది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ విభాగంలోని టాప్‌ టెన్‌లో రెండు ఐఐటీలకు చోటు దక్కింది. అవి ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ.
  • కళాశాలల విభాగంలో.. హిందూ కాలేజీ, మిరాండా హౌస్‌, సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ టాప్‌ 3లో ఉన్నాయి.
  • న్యాయ విద్య విభాగంలో.. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు టాప్‌లో నిలవగా.. నేషనల్‌ లా యూనివర్సిటీ ఢిల్లీ, నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా హైదరా బాద్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఫార్మసీ విభాగంలో.. జామియా హమదర్ద్‌ (ఢి ల్లీ) మొదటి స్థానం సొంతం చేసుకుంది. నైపర్‌ హైదరాబాద్‌ రెండో స్థానం, బిట్స్‌ ఫిలానీ మూడో స్థానం దక్కించుకున్నాయి.
  • వైద్య విద్య విభాగంలో.. ఎయిమ్స్‌ న్యూఢిల్లీ టాప్‌లో నిలిచింది. పీజీఐఎంబీ చండీగడ్‌, సీఎంసీ వెల్లూరు రెండు, మూడు స్థానాల్లో నిలి చాయి. అలాగే ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌లో ఐఐటీ రూర్కీ మొదటి స్థానం కైవసం చేసు కోగా.. ఐఐటీ ఖరగ్‌పూర్‌, నిట్‌ కాలికట్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పరిశోధన విద్యా సంస్థల విభాగంలో.. టాప్‌ మూడు స్థానాల్లో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఢిల్లీ ఉన్నాయి.
  • వరుసగా ఆరోసారి టాప్‌లో నిలిచిన ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌
  • ఉత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్సీ బెంగళూరు
  • మేనేజ్‌మెంట్‌ విభాగంలో టాప్‌ ఐఐఎం అహ్మదాబాద్‌
  • టాప్‌ టెన్‌లో హైదరాబాద్‌లోని నైపర్‌, నల్సార్‌లకు చోటు

#Tags