SBTETT: ‘ఐ2ఈ ల్యాబ్‌’

I2E Lab
  • రెండో దశ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఇన్నోవే షన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ), మేక్‌ రూమ్‌ ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన ‘ఐ2ఈ ల్యాబ్‌’ రెండో దశ సోమవారం ప్రారంభమైం ది. 14 వారాల పాటు సాగే ఐ2ఈ ల్యాబ్‌ కా ర్యక్రమంలో భాగంగా ఆరు రాష్ట్రాల నుంచి 20 స్టార్టప్‌ ఐడియాలు ఎంపికయ్యాయి. సమ గ్రత, వృద్ధికి ఉన్న అవకాశాలు, మార్కెట్‌ అవ సరాలు తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఐడియాలను ఎంపిక చేశారు. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పం జాబ్‌కు చెందిన యువ ఆవిష్కర్తల ఐడియాలు ఎంపిక కాగా.. తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్‌కు చెందిన ఆవిష్కర్తలున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్క్‌షాప్‌లో బిజినెస్‌ మోడల్‌ తది తరాలపై పలు రంగాలకు చెందిన నిపుణులు మార్గదర్శనం చేస్తారు. ఐ2ఈ ల్యాబ్‌ రెండో దశలో ఎంపికైన ఐడియాల్లో ఎలక్ట్రిక్‌ వాహనా లు, ఆరోగ్యం, విద్య, సుస్థిర అభివృద్ధి, గ్రీన్‌ టెక్, కమ్యూనిటీ హెల్త్‌ వంటి రంగాలకు సం బంధించినవి ఉన్నాయి. ఆవిష్కర్తల ఐడియా లకు పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందించి వారిని పూర్తిస్థాయి వాణిజ్య వేత్తలుగా తీర్చి దిద్దడమే ఐ2ఈ ఉద్దేశమని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొ న్నారు. ఐ2ఈ తొలి విడతలో ఎంపికైన ఐడి యాలు వాణిజ్య రూపం దాల్చుకున్న తీరుకు ఇటీవల జరిగిన టీఎస్‌ఐసీ ఎగ్జిబిషన్‌ అద్దం పట్టిందన్నారు. టీఎస్‌ఐసీ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీ సర్‌ శాంత తౌటం, మేక్‌ రూం ఇండియా వ్యవ స్థాపకుడు ప్రణవ్‌ హెబ్బర్‌ పాల్గొన్నారు.


Click here for more Education News
 

 

#Tags