School Holidays: ఇక్కడి పాఠశాలల్లో హిందూ పండుగల సెలవులు కుదింపు

పాట్నా: 2024వ సంవత్సరానికి బిహార్‌ విద్యా శాఖ న‌వంబ‌ర్ 27న‌ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ రాజకీయంగా అగ్గి రాజేసింది.

పాఠశాలల్లో హిందువుల పండుగలకు సెలవులు తగ్గించడం, ముస్లిం పండుగలకు సెలవుల సంఖ్యను పెంచింది. జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, వసంత పంచమి, జీవిపుత్రిక పర్వదినాల్లో సెలవులుండని ప్రభుత్వం చెప్పింది.

చదవండి: Public Holidays 2024: 2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే

ముస్లిం పండుగలైన ఈద్, బక్రీద్‌కు మూడు రోజుల చొప్పున, మొహర్రంకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం.. పాఠశాలల్లో ఏటా కనీసం 220 బోధనా రోజులు ఉండాలని, అందుకే సెలవులను తగ్గిస్తూ హాలిడే క్యాలెండర్‌ విడుదల చేసినట్లు విద్యా శాఖ వెల్లడించింది.

#Tags