Gandham Chandrudu: ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వ సహకారం

పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్లాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు

కృష్ణాజిల్లా కంకిపాడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ–మెడికల్‌ అకాడమీని ఆయన మార్చి 3న సందర్శించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో విద్యతో వెలుగులు నింపేలా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు ఐఐటీ, మెడికల్‌ అకాడమీల ద్వారా విద్యారి్థని, విద్యార్థులకు ఐఐటీజేఈఈ ఇంజనీరింగ్, నీట్‌–మెడికల్‌ ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్‌ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. గంధం చంద్రుడు వెంట డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, ఉన్నతాధికారులు ఉన్నారు.

చదవండి: 

​​​​​​​Imtiaz: ఏఎన్ యూలో మైనార్టీస్‌ స్టడీస్‌కు చర్యలు

Intermediate: పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఇదే.. జూన్ లో ఫలితాలు..

Intermediate: ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌లో మార్పులు.. కోత్త షెడ్యూల్‌ ఇదే..

#Tags