Legal Services Authority: ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ నేరం

రెబ్బెన(ఆసిఫాబాద్‌): ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ్‌ అన్నారు.

మండలంలోని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలో ఆగ‌స్టు 14న‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రకాశ్‌ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్‌కు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.

చదవండి: Lifetime Achievement Awards: మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

అనంతరం కళాశాల సిబ్బంది సీనియర్‌ సివిల్‌ జడ్జిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెండర్‌ స్పెషలిస్టు రాణి, అడ్వకేట్లు శ్రీదేవి, వెంకటేశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

#Tags