Book Reading: పుస్తక పఠనంతో అపార జ్ఞానం

ఆసిఫాబాద్‌రూరల్‌: పుస్తక పఠనంతో అపార జ్ఞానం సంపాదించవచ్చని డీఈవో అశోక్‌ అన్నారు.

జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జ‌నవ‌రి 24న‌ నిర్వహించిన జిల్లాస్థాయి రీడథాన్‌(పఠన పోటీలు)లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఒక పుస్తకం వందమంది మిత్రులతో సమానమన్నారు. రూం టు రీడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పఠన పోటీల్లో 623 మంది పాల్గొన్నారని తెలిపారు.

చదవండి: Seethakka: ప్రతి విద్యాసంస్థలో ఈ పుస్తకం ఉండాలి

జిల్లా స్థాయిలో స్కూల్‌ కాంప్లెక్స్‌ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన 45 మంది పాల్గొనగా.. వీరిలో దహెగాం మండలం రాస్పెల్లికి చెందిన సంజన మొదటి బహుమతి పొందగా, రెండో బహుమతి వాంకిడి మండలం లెండిగూడకు చెందిన సిద్దేశ్వర్‌, మూడో బహుమతి పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయికి చెందిన అఖిల సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌వోలు శ్రీనివాస్‌, సుభాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags