Seethakka: ప్రతి విద్యాసంస్థలో ఈ పుస్తకం ఉండాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యా సంస్థలో భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
ఈ పుస్తకం పట్ల విద్యార్థులకు అవగాహన పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పుస్తకంలోని అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించాలని, దీంతో వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవగాహన పెరుగుతుందన్నారు.
చదవండి: Constitutional Values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా?
జనవరి 22న బంజారాహిల్స్ లోని బంజారా భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల ప్రిన్స్‌పాల్స్, గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ ఏడా ది జరిగే పదో తరగతి పరీక్షల్లో గిరిజన విద్యా సంస్థలన్నీ వంద శాతం ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్త మ ఫలితాలు సాధించిన సంస్థలకు బహుమతులందిస్తామని, ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. గిరిజన విద్యాసంస్థల్లో పాఠ్యాంశ బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Published date : 24 Jan 2024 10:09AM