Advanced Courses: ఉపాధి కోర్సులను వినియోగించుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెడుతున్న అడ్వాన్స్‌డ్‌ కోర్సులను వినియోగించుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ కోరారు.

అక్టోబర్ 24న కలెక్టరేట్‌లో అడ్మిషన్లు భర్తీపై నిర్వహించనున్న అవగాహన సదస్సు ఏర్పాట్లుపై ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా అవకాశాలున్న కోర్సులను ప్రభుత్వం అధ్యయనం చేసి ఈ సంవత్సరం నూతనంగా 6 కోర్సులను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

10వ తరగతి ఆపై విద్యార్హతలున్నవారు అర్హులని తెలిపారు. అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను భూపాలపల్లిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చదవండి: Employment Opportunity : స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ శిక్ష‌ణ పొందిన వారికి ఉపాధి క‌ల్పించాలి

ఈ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన యువతీ, యువకులకు ఈ కోర్సులు అభ్యసించడంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.

ఈ కోర్సులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌ జామ్లానాయక్‌, ఇన్‌చార్జ్‌ డీఆర్డీఓ అవినాశ్‌, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్‌, మేనేజర్‌ రాములు, సహకార అధికారి వాలియానాయక్‌ పాల్గొన్నారు.

#Tags