Guest Lecturers: కొనసాగింపునకు అనుమతి

అతిథి అధ్యాపకుల కొనసాగింపునకు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసేందుకు అతిథి అధ్యాపకులకు ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ ఆగస్టు 30న ఉత్తర్వులు జారీ చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.

గెస్ట్‌ లెక్చరర్లకు శుభవార్త 

రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కాలేజీల్లో గతంలో పనిచేసిన గెస్ట్‌ లెక్చరర్లనే తిరిగి కొనసాగించాలని ఇంటర్‌ విద్య అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అక్టోబర్‌ 13న క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 405 జూనియర్‌ కాలేజీల్లో 1654 మంది గెస్ట్‌ లెక్చరర్లు 2020 ఏప్రిల్‌ వరకూ పనిచేశారు. కోవిడ్‌ కారణంగా వారి సేవలు వినియోగించుకోవడం లేదు. కాలేజీల్లో అధ్యాపకుల కొరతను దృష్టిలో ఉంచుకుని గెస్ట్‌ లెక్చరర్స్‌ సేవలు వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఇంటర్‌ అధికారులతో ఇంటర్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ సమీక్ష జరిపారు. గతంలో పనిచేసిన వారినే తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు.

చదవండి: 

#Tags