Telangana News:గురుకులం విద్యార్థులకు అభినందనలు తెలిపిన కలెక్టర్
కడెం: గత నెల 19, 20 గుజరాత్‌లోని నడియార్‌లో నిర్వహించిన జాతీయస్థాయి అండర్–14 విభాగం అర్చరీ పోటీల్లో మారుమూల అల్లంపల్లి గ్రామంలోని జీయర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన విద్యార్థి జగన్ ద్వితీయస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. జగన్‌తో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు శశివర్ధన్, హరిఓం ప్రకాశ్‌ను సోమవారం కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల నిర్వాహకులు శాంతారామ్‌స్వామి, ఉపాధ్యాయుడు సాగర్, తదితరులు పాల్గొన్నారు.
AP Tenth Class Annual Exams 2025:పదో తరగతి పరీక్షలను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యా శాఖ యోచన....
#Tags