10th Class Exam Answer Sheet: పాస్‌ చేయండి లేదంటే పెళ్లి చేస్తారు.. జవాబుపత్రంలో ఈ విద్యార్ధిని వేడుకోలు..

పట్నా: ఎలాగోలా పాస్‌ చేయండని, లేదంటే నాకు మా నాన్న పెళ్లి చేసేస్తాడని పదో తరగతి విద్యార్థిని ఒకరు జవాబు పత్రంలో వేడుకున్న ఘటన ఒకటి బిహార్‌లో జరిగింది.

 సంబంధిత టెన్త్‌ క్లాస్‌ ఆన్సర్‌ షీట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను తాజాగా ఉపాధ్యాయులు దిద్దుతుండగా ఈ విన్నపం విషయం బయటపడింది. కొందరు కవిత్వాలు, మరికొందరు ఉద్వేగంతో కూడిన వాక్యాలు, ప్రార్థనలు రాశారు.

చదవండి: Highest Districts: దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి.. అవి ఎన్ని?

అయితే ఆరాహ్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన ఒకమ్మాయి మాత్రం తన ఇంట్లో చదువుకునే అమ్మాయిల దుస్థితిని విన్నవించుకుంది. ‘ మా నాన్న ఒక పేద రైతు.

చదువులకయ్యే ఖర్చులను భరించలేని కుటుంబం మాది. అందుకే మేం చదువుకోవడం మా వాళ్లకు ఇష్టంలేదు. మంచి మార్కులు సాధించలేకపోతే చదువు కొనసాగించలేము.

వెంటనే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసుకోవడం మాకు అస్సలు ఇష్టంలేదు. మమ్మల్ని కాపాడండి. నిరుపేదరాలిగా వేడుకుంటున్నా. నన్ను పాస్‌ చేయండి’ అని అమ్మాయి రాసింది. 

చదవండి: Bharat Ratna: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..

#Tags