National Education Policy 2020: ఎన్‌ఈపీ రద్దుకు 3న ‘చలో ఢిల్లీ’

సూర్యాపేటటౌన్‌ : నూతన విద్యావిధానం –2020 రద్దు కోసం అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆధ్వర్యంలో జ‌నవ‌రి 3న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రేపాక లింగయ్య తెలిపారు.

జ‌నవ‌రి 31న‌ జిల్లా కేంద్రంలోని డీటీఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించే ధర్నాలో విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

చదవండి: National Education Policy: విద్యార్థులకు వృత్తివిద్య నైపుణ్యం

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ– 2020 పేదలను మధ్యలో చదువుకు స్వస్తి పలికేలా చేస్తుందన్నారు. సమావేశంలోఎల్‌.భద్రయ్య, కరీం, నాగేందర్‌, వెంకట్‌, దాసరి రాములు, ఆవుల నాగరాజు, సిద్దీఖ్‌పాషా, కవిత, వెంకన్న, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటయ్య, సుధాకర్‌, నర్సయ్య పాల్గొన్నారు.

#Tags