No Detention Policy: నో డిటెన్షన్‌ విధానం రద్దు .. నో డిటెన్షన్ విధానం అంటే ఏమిటి?

పాఠశాల విద్యపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థుల నో డిటెన్షన్ విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నో డిటెన్షన్ విధానం అంటే ఏమిటి?

నో డిటెన్షన్ విధానం అంటే విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్ అయినా వారి తరగతిలో నిలిపివేయకుండా వారిని తర్వాతి తరగతికి ప్రమోట్ చేసే విధానం. ఇది ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009 (RTE Act) కింద అమలులోకి వచ్చింది.

చదవండి: Travel Insurance: విదేశీ విద్యకు ప్రయాణ బీమా దన్ను.. బీమా ప్రయోజనాలు ఇవే..

ఇది వరకు 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కాని ఇకపై 5 నుంచి 8 వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ఆయా తరగతులు ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రెండు నెలల్లో మళ్ళీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

విద్యాహక్కు చట్టం -2019కి చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి. అయితే పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలో ఉండటం వలన ఈ విషయంలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది.
 

#Tags