‘బయోటెక్నాలజీ’కి ఉజ్వల భవిష్యత్‌

నల్లగొండ రూరల్‌ : బయో టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని ఎంజీయూ రిజిస్ట్రార్‌ అల్వాల రవి అన్నారు.

జూలై 28న‌ యూనివర్సిటీలో బయో టెక్నాలజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు హైదరాబాద్‌ కేంద్రంగా అనేక అవకాశాలు ఉన్నాయని, వ్యాపార రంగంలో మంచి భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి: Computer Science Course : కంప్యూట‌ర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్య‌త‌.. మొద‌టి విడ‌త కౌన్సెలింగ్‌లోనే..!

ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఎదిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రశాంతి, సైన్స్‌ కాలేజీ ప్రిన్సి పాల్‌ ప్రేమ్‌సాగర్‌, మాధురి పాల్గొన్నారు.

#Tags