Rani Rudramadevi Legendary Awards: విద్యారంగంలో ఉత్తమ సేవలు.. అవార్డు అందుకున్న హేమలత
సాక్షి, సిటీబ్యూరో: రాణీ రుద్రమాదేవి లెజెండరీ అవార్డును క్యాపిటల్ విద్యాసంస్థల డైరెక్టర్ హేమలత అందుకున్నారు.
అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ 78వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.
చదవండి: English Language Skills: ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలు పెంచాలి
పదేళ్లలో విద్యారంగంలో అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డా.ఎస్.సరోజనమ్మ తెలిపారు. తక్కువ ఫీజుతో ఉత్తమ విద్యా విధానాల అమలు, ఉద్యోగుల సేవలను పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, దైవజ్ఞశర్మ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
#Tags