APAAR.. విద్యా మంత్రిత్వ శాఖ ప్రతీ విద్యార్థికి అందించే గుర్తింపు నంబర్
కరీంనగర్: అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ).. దేశంలో ప్రతీ విద్యార్థికి అందించే గుర్తింపు నంబరు.
జాతీయస్థాయిలో ప్రతీ విద్యార్ధికి ఒక్కో నంబరు కేటాయించి.. తదనుగుణంగా వారి సర్వ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. ‘వన్ నేషన్ వన్ స్టూడెంట్’ నినాదంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. జాతీయ నూతన విద్యావిధానం–2020 అమలులో భాగంగా ఈ దిశగా అడుగేసింది.
చదవండి: Scholarship: స్కాలర్ షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. వీరు అర్హులు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు కేటాయించనుండగా.. కార్యాచరణ మొదలు కానుంది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. వివిధ దశల్లో సర్కారు బడుల నిర్వాహకులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags