Kakatiya University: కేయూలో నిరంకుశ పాలన

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి నిరంకుశ పాలన కొనసాగుతోందని, ఇక్కడ నెలకొన్న వివిధ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేయూ అధ్యాపకుల సంఘం( అకుట్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ తౌటం శ్రీనివాస్‌, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ మామిడాల ఇస్తారి అన్నారు.

ఈ మేరకు డిసెంబ‌ర్ 6న‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి శ్రీనివాస్‌రావును కలిసి పది అంశాలపై సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేయూలోని వివిధ విభాగాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు.
కనీసం డిపార్ట్‌మెంటల్‌ కమిటీలు కూడా రెండేళ్ల నుంచి రెన్యూవల్‌ చేయలేదన్నారు. డిపార్ట్‌మెంటల్‌ కమిటీల ద్వారా జరగాల్సిన బదిలీలు,నియామకాలను వీసీ, రిజిస్ట్రార్‌ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. వివిధ విభాగాల్లో విభాగాల అధిపతుల (హెచ్‌ఓడీ), బోర్డు ఆఫ్‌స్టడీస్‌ చైర్‌పర్సన్ల (బీఓఎస్‌)ను రెండేళ్లకొకసారి మార్చాల్సిండగా కొన్ని విభాగాలల్లో ఇప్పటి వరకు వారినే కొనసాగిస్తూ వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారన్నారు.
ఫార్మసీ కళాశాలలో ఇప్పటివరకు బీఓఎస్‌ను నియమించకుండా వీసీ, రిజిస్ట్రార్లు తాత్సారం చేస్తున్నారన్నారు. అలాగే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, సోషియాలజీ విభాగాల్లో కూడా సీనియారిటీ ప్రకారం హెచ్‌ఓడీ ,బీఓఎస్‌లను నియమించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

చదవండి: Education: విద్య ద్వారానే వ్యవస్థ నిర్మాణం

అధ్యాపకులకు పదోన్నతుల ఎరియర్స్‌ ఏవీ?

గతేడాదిలో అధ్యాపకులకు రావాల్సిన పదోన్నతుల ఎరియర్స్‌ మూడు, నాల్గవ ఇన్‌స్టాల్‌మెంట్లు కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వడం లేదని అకుట్‌ అధ్యక్షుడు ఆచార్యుడు తౌటం శ్రీనివాస్‌, జనరల్‌ సెక్రటరీ మామిడాల ఇస్తారి ఆరోపించారు.
యూనివర్సిటీ అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారన్నారు.యూనివర్సిటీలో 16 మంది అడ్జెంట్‌ ప్రొఫెసర్లను నియమించి వర్సిటీ ఖజానాకు గండి కొడుతున్నారన్నారు.

చదవండి: G Gnanamani: 31 నుంచి కేయూలో కృష్ణా తరంగ్‌

యూజీసీకి ఫిర్యాదు

కొందరి అధ్యాపకులకు పదోన్నతులు కల్పించకపోవడంపై యూజీసీకి కూడా ఫిర్యాదు చేసినట్లు అకు ట్‌ బాధ్యులు తెలిపారు.
2010 బ్యాచ్‌ అధ్యాపకుల కు కూడా ఇప్పటి వరకు పదోన్నతులకు సంబంధించి ఇంటర్వ్యూలపై నిర్ణయం తీసుకోవడంలేదన్నా రు. యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించకుండా మరోవైపు కొందరిని షోకాజ్‌కు నోటీసుల, క్రమశిక్షణ చర్య, బదిలీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
తాము రిజిస్ట్రార్‌కు సమర్పించిన పది అంశాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

అవసరమైతే అధ్యాపకుల సమస్యలపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రార్‌కు వినతి పత్రం సమర్పించిన వారిలో అకుట్‌ ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్‌ బ్ర హ్మేశ్వరి,కార్యవర్గ సభ్యుడు రమేశ్‌ పాల్గొన్నారు.

ఆ అధ్యాపకులకు పదోన్నతులు ఏవీ?

సంవత్సరం క్రితం పదోన్నతులకు దరఖాస్తులు చేసుకొన్ని కొందరి అధ్యాపకులకు ఇప్పటి వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, యూనివర్సిటీ అధికారులు మాత్రం సీనియర్‌ ప్రొఫెసర్‌ పదోన్నతులు నియామకాలకు విరుద్ధంగా చేపట్టారని ఆరోపించారు.
రిటైర్డ్‌ అయ్యే చివరి రోజు సీనియర్‌ ప్రొఫెసర్‌ పదోన్నతులు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.వారికి కావాల్సినవారికి పదోన్నతుల కల్పించి కొందరికి సీనియర్‌ ప్రొఫెసర్లుగా, మరికొందరికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించలేదన్నారు.

#Tags