Anganwadi Workers: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

రాయచోటి అర్బన్‌ : అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అక్టోబర్ 21న పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అసోసియన్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం సరోజమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీఓ విడుదల చేయాలని కోరారు.

విధి నిర్వహణలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త చనిపోతే దహన సంస్కార ఖర్చుల కింద రూ.20వేలు, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలను అంగన్‌వాడీలకు అమలు చేయాలన్నారు.

చదవండి:Anganwadi Jobs: మహిళాలకు గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు 10వ తరగతి పాస్‌ ఐతే చాలు..

త్వరలో జరగబోయే రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో అంగన్‌వాడీల సమస్యలపై చర్చించి సమ్మెకాలపు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు మంజుల, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రామక్రిష్ణ, సాంబశివ, ఉపాధ్యక్షుడు పి.ఎల్‌.నరసింహులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు, యూనియన్‌ నాయకులు నాగేశ్వరమ్మ, సుజాత, అనురాధ, దుర్గ, విజయ, కుమారి, భారతి, రమణమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు.
 

#Tags