డ్రగ్స్‌, మత్తుపదార్థాలు, గంజాయికి అలవాటుపడితే జీవితాలు నాశనం: డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి గైడెన్స్

కాళేశ్వరం: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, మత్తుకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

మహదేవపూర్‌ మండలంకేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బండం రాజిరెడ్డి అధ్యక్షతన ఆగ‌స్టు 23న‌ యాంటీ డ్రగ్స్‌ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ప్రథమ సీహెచ్‌ అభిరామ్‌, ద్వితీయ సాయిప్రదీప్తిక, తృతీయ ఎ.రాజశేఖర్‌లకు బహుమతులు అందజేశారు. బాలుర, బాలికల పాఠశాలలకు గ్రంథాలయం, బుక్స్‌, పోటీపరీక్షల మ్యాగజైన్‌ల కోసం ఖర్చులకు డీఎస్పీ రూ.10వేల నగదు విరాళంగా అందజేశారు.

చదవండి: Burra Venkatesham: కాలేజీల్లో డ్రగ్స్‌ కట్టడికి క్లబ్‌లు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్‌, మత్తుపదార్థాలు, గంజాయికి అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడచుకోవాలన్నారు. తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు.

ఎవరైనా మత్తుపదార్థాలకు అలవాటుపడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. కాళేశ్వరంలో ఎస్సై చక్రపాణి ఆధ్వర్యంలో జిల్లాపరిషత్‌ పాఠశాలలో హెచ్‌ఎం అన్నపూర్ణ అధ్యతక్షన డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఐ రామచంద్రరావు, ఎస్సై పవన్‌కుమార్‌, బాలికల పాఠశాల హెచ్‌ఎం సరిత తదితరులు పాల్గొన్నారు.

#Tags