BRAOU: ఓపెన్‌ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు పెంపు

నిజామాబాద్‌ అర్బన్‌ : బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంచినట్లు వర్సిటీ కోఆర్డినేటర్‌ రంజిత ఒక ప్రకటనలో తెలిపారు.

జ‌నవ‌రి 10వ తేదీలోపు రూ. 500 అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు రూ. 500 అపరాధ రుసుముతో జ‌నవ‌రి 23వ తేదీ లోపు చెల్లించాలన్నారు.

చదవండి: BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ 25వ స్నాతకోత్సవం.. కొత్త కోర్సులు ప్రారంభం..

అలాగే జ‌నవ‌రి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఫీజు సెకండియర్‌ పరీక్షలు, జ‌నవ‌రి 27 నుంచి 31 తేదీ వరకు ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 16 తేదీ నుండి 22వ తేదీ వరకు యూజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు యూజీ ఐదో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయన్నారు.

#Tags