UPSC CSE-2023 Ranker Pranay Kumar : సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతోనే చ‌దివా.. ఎట్ట‌కేల‌కు 554వ ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

తెలంగాణ‌లోని రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ప్రభాకర్‌, లక్ష్మి దంపతుల మూడో కుమారుడు ప్రణయ్‌కుమార్ ఇటీవ‌లే విడుద‌లైన‌ యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 554వ ర్యాంకు సాధించారు.

గతేడాది మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 885వ ర్యాంక్‌ సాధించి ఐఎఫ్‌ఎస్‌ శిక్షణలో ఉన్నారు. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతూ పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకున్నారు. 

☛ UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..

సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో..

ప్రణయ్‌కుమార్‌ నాగారంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివారు. గజ్వేల్‌లో పాలిటెక్నిక్‌, కూకట్‌పల్లి జేఎన్టీయూలో బీటెక్‌ ఎలక్ట్రానిక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివి గతేడాది సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. ప్రణయ్‌కుమార్‌కు సివిల్స్‌ ర్యాంక్‌ రావడంపై కుటుంబ సభ్యులు సంబురాలు చేసుకున్నారు. అలాగే గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

#Tags