Success Story : ఇంట్లోనే ఉండి చ‌దివా.. సివిల్స్ కొట్టానిలా.. కానీ.. నా ల‌క్ష్యం మాత్రం ఇదే..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే.. సివిల్‌ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘన ఆలిండియా స్థాయిలో 83వ ర్యాంకు సాధించింది. ఈ నేప‌థ్యంలో కావలి మేఘన స‌క్సెస్ స్టోరీ మీకోసం..
Kavali Meghana

కుటుంబ నేప‌థ్యం :

ఈమె తండ్రి రాములు. ఈయ‌న టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్నారు. త‌ల్లి సుజాత. వీరి పెద్దకూతురు కావలి మేఘన.

Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..

ఎడ్యుకేష‌న్ :
చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో నివసిస్తూన్న ఈమె మదీనగూడలోని విజ్ఞాన్‌ విద్యాలయ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి కూకట్‌పల్లి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌, 2012-16లో వరంగల్‌ నీట్‌లో ఎలక్ర్టికల్‌ ఇంజినీరింగ్‌ (బీటెక్‌), 2016-18 ఐఐఎం లక్నోలో పీజీ పూర్తి చేసుకున్నారు. 

జాబ్‌కు రిజైన్‌చేసి.. సివిల్స్‌కు ప్రిపేర‌య్యారిలా..
2018-19లో ఐటీసీ లిమిటెడ్‌ బెంగుళూర్‌లో అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేసి 2019లో ఉద్యోగానికి రాజీనామ చేసి 2020లో ఢిలీల్లోని వాజీరాం అండ్‌ రవి ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. 2020-21 కరోనా కార‌ణంగా.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇంట్లో ఉండే మెయిన్స్​‍కు ప్రిపరేషన్‌ అవుతూ పరీక్షలు రాసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే 83వ ర్యాంకు సాధించింది.

Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్‌.. వీరి స‌క్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..

సివిల్స్​‍ వైపు ఎందుకు వ‌చ్చానంటే..
సివిల్స్​‍ ద్వారా సంపూర్ణమైన సేవ చేసే అవకాశం ఉంటుంది. నాలో ఉన్న సామర్థ్యంతో సమాజంలో మంచి మార్పు తీసుకువస్తా అనే నమ్మకంతో సివిల్స్​‍ను ఎంచుకున్నాను. అందుకే ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. మొదటి ప్రయత్నంలో సివిల్స్​‍లో 83వ ర్యాంకు సాధించాను. 

ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ అవుతూ..
ఢిల్లీలో 9 నెలలు కోచింగ్‌ తీసుకున్నాను. కొవిడ్‌ కారణంగా హైదరాబాద్‌కు వచ్చి ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్‌ అయ్యాను. ఆప్షనల్‌ సబెక్టు సోషలజి. ప్రభుత్వ పథకాలు, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ, జీకే సామాజిక శాస్త్రం చదువుతూ పరీక్షలు రాశాను.

☛ Success Story: నాడు పశువులకు కాప‌ల ఉన్నా.. నేడు దేశానికి కాప‌ల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..

ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే..
తెలంగాణపై ప్రశ్నలు, తాగునీళ్లు సమస్యలు, గ్రూప్స్​‍ తదితర ప్రశ్నలు అడిగారు.

నా జీవిత లక్ష్యం ఇదే..
సమాజ సేవే నా జీవిత లక్ష్యం. ఐఏఎస్ సాధించి విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వ్యక్తి ఉన్నత చదువు చదివేందుకు కృషి చేస్తాను. భారతదేశంలో ప్రాథమిక విద్య బాగుంది. ఉన్నత విద్యకు వచ్చేవరకు సరైన సౌకర్యాలు, వసతులు లేకపోవడంతో సరైన విధంగా విద్యార్థులకు విద్యను అందించలేకపోతున్నాం. అందుకు ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి సమసమాజ నిర్మాణానికి చదువు అనే చక్కటి పునాది బాటలు వేస్తాను. పేద, ధనిక భేదాలు లేకుండా ప్రతి వ్యక్తికి సంపూర్ణమైన విద్యను అందించాలి.

➤ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..

జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా..
విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విద్యను అందిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సంతోషంగా జీవించగలరు. అందుకు ప్రతి ఒక్కరూ చిన్నవయస్సు నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో ముందుకు వెలితే ఎంతటి విజయానైనా సాధించగలుగుతాం.

అభినంద‌న‌ల వెల్లువ‌..

కావలి మేఘనను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కష్టపడి లక్ష్యంకోసం పనిచేసే వారికి మేఘన స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే మంత్రి కేటీఆర్‌ ఆమెను సత్కరించారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్‌రెడ్డి, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి, టిఆర్ఎస్ కెవి వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, మేఘన పెదనాన్న, జహీరాబాద్‌ మాజీ జడ్పీటీసీ కే భాస్కర్ తదితరులు మేఘనను అభినందించారు.

☛ IAS Officer Success Story : నాన్న డ్రైవ‌ర్‌.. కూతురు ఐఏఎస్‌.. చ‌ద‌వ‌డానికి డ‌బ్బులు లేక‌..

#Tags