Indian Army Jobs Recruitment 2024 : ఆగస్టు 23వ తేదీ నుంచి భారీగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎక్కడంటే..?

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అధికారులకు ఆదేశించారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సంబంధించి ఆర్మీ, జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఆగస్టు 6వ తేదీన (మంగళవారం) కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. 

రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన.. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కయ్యపాలెం పోర్ట్‌ ట్రస్ట్‌ డైమండ్‌ జూబ్లీ స్టేడియంలో ఆగ‌స్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుందని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 8వేల మంది యువత పాల్గొననున్నారని, ర్యాలీ సాఫీగా జరిగేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణ, సమన్వయం కోసం సెట్విస్‌ సీఈవో డి.కీర్తి, డీఎస్టీవో జూన్‌ గ్యాలియేట్‌ను నోడల్‌ అధికారులుగా నియమించినట్లు చెప్పారు.

☛ Constable Jobs Notification 2024 : ఈ నెల చివ‌రిలోనే భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం పోస్టులు ఇవే...!

అభ్యర్థులకు సూచ‌న‌లు ఇవే..

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే సమయంలో స్టేడియం వద్ద తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, మొబైల్‌ టాయిలెట్స్, డస్ట్‌ బిన్స్‌ ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను కోరారు. ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకునేందుకు ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు. వేదిక వద్ద పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్‌ మళ్లింపు వంటి చర్యలు చేపట్టాలని డీసీపీని కలెక్టర్‌ ఆదేశించారు. అభ్యర్థుల రెసిడెన్సీ, నేటివీటి సర్టిఫికెట్లను పరిశీలించేందుకు ఉప తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని విశాఖ, భీమిలి ఆర్డీవోలను ఆదేశించారు. ఆర్మీ పర్సనల్స్‌ ఉండేందుకు వీలుగా వసతి ఏర్పాటు చేయాలని డీవైవోను ఆదేశించారు.

☛ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

#Tags