Government Jobs Applications 2024 : 55000ల‌కు పైగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీలు ఇదే..!

కేంద్ర‌ప్ర‌భుత్వ‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని వివిధ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు.. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ఇండియా పోస్ట్, ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇటీవల కొన్ని ఉద్యోగాల‌కు నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. అలాగే త్వ‌ర‌లోనే మ‌రికొన్ని ఉద్యోగ నోటిఫికేష‌న్లు రానున్నాయి.  ప్ర‌స్తుతం 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. అర్హ‌త‌లు.. మొద‌లైన ముఖ్య‌మైన వివ‌రాలు మీకోసం..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్ చేసే ఉద్యోగాలు ఇవే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 8,326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18000 నుంచి రూ.22,000 మధ్య లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ జులై 31న ముగుస్తుంది.

☛➤ Telangana History Quiz in Telugu: తెలంగాణలో ఏ దేవాలయ శిఖరాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించారు?

ఇండియా పోస్ట‌ల్‌లో భ‌ర్తీచేయ‌నున్న‌ ఉద్యోగాల వివ‌రాలు ఇవే..
ఇండియా పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో జీడీఎస్ ఉద్యోగాల‌కు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్‌తో 35,000 ఖాళీలు భర్తీ కానున్నాయి. 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్‌ను ఆపరేట్ చేయడం తెలిసి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 25న ప్రారంభం కాగా, ఈ గడువు జులై 15న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు indiapostgdsonline.gov.in  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఐడీబీఎస్ (IDBI) బ్యాంక్‌లో ఉద్యోగాలు..
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 31 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ ప్రారంభించింది. ఏదైన బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 1,000; SC, ST, PwD కేటగిరీ అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి.

ఐబీపీఎస్ 6,128 క్లర్క్ ఉద్యోగాలు..
ఐబీపీఎస్ 6,128 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ డిగ్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.19,900 నుంచి రూ.47,920 మధ్య లభిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 27 సంవత్సరాలలోపు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ibpsonline.ibps.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జులై 21న ముగుస్తుంది.

హర్యాణా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (HSSC) 6,000 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ hssc.gov.in విజిట్ చేయాలి.

మొత్తం 16347 టీచ‌ర్ పోస్టులు.. 
16,347 టీచ‌ర్‌ పోస్టులకు AP DSC 2024 నోటిఫికేష‌న్‌ విడుదల చేయ‌నున్నారు.  జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి.. 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార వ‌ర్గాల ద్వారా తెస్తుంది.

☛ AP&TS DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ‌లో గ్రూప్‌-2, 3 పోస్టుల‌కు..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 783 గ్రూప్–2 పోస్టుల‌ను.., 1388 గ్రూప్‌-3 భ‌ర్తీ చేయ‌నున్న విష‌యం తెల్సిందే. 

☛➤ Two Lac Government Jobs 2024 Details in TS : 2 లక్షల ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాల్సిందే.. గ్రూప్‌-1లో 1,600, గ్రూప్‌-2లో 2,200, గ్రూప్‌-3లో 3000 పోస్టుల‌ను..

#Tags