APPSC Exams 2023: పోటీ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు.. August 19 నుంచి యూపీఎస్సీ పరీక్షలు..

మహారాణిపేట: ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ద్వారా నగరంలో నిర్వహిస్తున్న పలు పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో ఎస్‌.శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం పలు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష చేశారు.
పలు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న డీఆర్వో శ్రీనివాసమూర్తి

ఈ నెల 18, 19, 21, 22 తేదీల్లో ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలు, 19, 20 తేదీల్లో యూపీఎస్సీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పరీక్షకు 5,115 మంది, టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ అధికారి పరీక్షకు 530 మంది, శాంపిల్‌ టేకర్‌ పరీక్షకు 166 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందుకు నగరంలో నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also read: Jobs in Hetero Drugs: August 21న క్యాంపస్‌ ఇంటర్వ్యూలు..

19, 20న కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష

కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ పోటీ పరీక్ష ఈ నెల 19, 20వ తేదీల్లో యూపీఎస్సీ నిర్వహిస్తోందని.. ఈ పరీక్షకు జిల్లాలో 1,632 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందని.. నగరంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎన్‌.వెంకటరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ మల్లికార్జునరావు, ఏఎస్‌వో పద్మ ప్రియ, యూపీఎస్సీ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Also read: APPSC గ్రూప్‌-1 2023 ఫ‌లితాలు: టాప్‌–6 మహిళా అభ్యర్థులు వీరే.. #sakshieducation

#Tags