ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..!
లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల లక్ష్యం..ఐటీ రంగంలో ఉద్యోగం! మరి ప్రస్తుతం ఐటీలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? నియామకాల పరంగా భరోసా కల్పించే కోర్సులు ఏవి? త్వరలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!!
ఐటీ రంగంలో ప్రస్తుతం జాబ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కోర్ అంశాలైన కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ మొదలు బ్లాక్‌చైన్, ఐవోటీ వరకూ.. సరికొత్త టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగార్థులు ఎమర్జింగ్ టెక్నాలజీపై పట్టుసాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు దక్కించుకోవడానికి మార్గాలు, నేర్చుకోవాల్సిన కోర్సుల గురించి తెలుసుకుందాం... ముఖ్యంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జావా, రోబోటిక్స్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, డేవాప్స్, క్లౌడ్ సర్వీసెస్ వయా ఎంఎస్ ఎజ్యూర్, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి వాటిపై అవగాహన పెంచుకోవడం ద్వారా జాబ్ మార్కెట్‌లో అవకాశాలు అందుకోవచ్చు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ : పస్తుతం బాగా ట్రెండింగ్ అవుతున్న స్కిల్.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ప్రతిదీ డిజిటల్ రూపం సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. పారదర్శకతకు, భద్రతకు సంబంధించి కీలకంగా నిలుస్తోంది బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. బ్లాక్‌చైన్ కౌన్సిల్, ఇతర సంస్థల అంచనా ప్రకారం- వచ్చే మూడేళ్లలో దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో లభించనున్నాయి. ప్రధానంగా ఫిన్‌టెక్ సంస్థలు, పీర్ టు పీర్ లెండింగ్ సంస్థల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ నిపుణుల అవసరం ఉంటుంది. ఈ టెక్నాలజీ హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లోనూ కీలకంగా మారనుంది. బ్లాక్‌చైన్‌పై పట్టు సాధించడానికి ప్రస్తుతం పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్‌చైన్ కౌన్సిల్,బ్లాక్‌చైన్ అసోసియేషన్ వంటి సంస్థలు ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. అదే విధంగా ఇటీవల ఐఐటీ-హైదరాబాద్,టాలెంట్ స్ప్రింట్ సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో.. అడ్వాన్‌సడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించారుు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు ఫైనాన్షియల్ సెక్టార్, హెల్త్‌కేర్, టెలికం, ఆరుుల్ అండ్ గ్యాస్ రంగాల్లో అవకాశాలు అందుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స.. ప్రస్తుతం ఐటీ రంగంలో విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న మరో కీలకమైన టెక్నాలజీ. మానవ ప్రమేయం లేకుండా.. కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల ఆధారంగా కార్యకలాపాలను నిర్వహించడమే ఏఐ ప్రత్యేకత. విస్తృతమైన డేటాను నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ ఆధారంగా విశ్లేషించేందుకు ఏఐ దోహదపడుతోంది. రానున్న నాలుగేళ్లలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో దాదాపు 3లక్షల కొత్త ఉద్యోగాలు యువతను పలకరించనున్నాయి. ప్రస్తుతం ఐబీఎం, వీఎంవేర్, సిస్కో, ఇంటెల్ వంటి సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా సర్టిఫికెట్లు సొంతం చేసుకుంటే జాబ్ మార్కెట్‌లో ముందంజలో నిలిచే అవకాశం ఉంది. వీరు ఏఐ ఆర్కిటెక్ట్స్, ఏఐ ఇంటర్‌ఫేస్ ఎగ్జిక్యూటివ్ వంటి కొలువులు దక్కించుకోవచ్చు. నైపుణ్యం, అర్హతలు, అనుభవం ఆధారంగా రూ.15 లక్షల వరకూ వార్షిక వేతనం అందుకోవచ్చు.
రోబోటిక్స్ :
{పస్తుతం అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న మరో కొత్త టెక్నాలజీ.. రోబోటిక్స్. ముఖ్యంగా ఐటీ సంస్థల క్లయింట్‌లుగా పేర్కొనే బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్ విభాగాల్లోని సంస్థలు రోబో ఆధారిత సేవలు అందిస్తున్నాయి. ఈ రోబోలు నిర్దేశిత విధులు నిర్వర్తించేలా ప్రోగ్రామింగ్, కోడింగ్ రూపొందించడం ముఖ్యం. దాంతో రోబోటిక్ స్కిల్స్ ఉన్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పలు స్టాఫింగ్ సంస్థలు, ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం-రోబోటిక్స్‌లో రానున్న మూడేళ్లలో నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత కోర్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడం ద్వారా కొలువులు దక్కించుకోవచ్చు. ఆయా నైపుణ్యాలున్న వారికి రోబోటిక్స్ టెక్నీషియన్స్; రోబోట్ డిజైన్ ఇంజనీర్; రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్; సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్; ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్; అగ్రికల్చర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్; రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్ వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే నెలకు రూ.50వేల వేతనం సొంతం చేసుకోవచ్చు. రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ ఆన్‌లైన్, రోబో జీనియస్ అకాడమీలు అందించే సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఈ రంగంలో కొలువు ఖాయం చేసుకోవచ్చు.
పైథాన్ డెవలపర్ :
ఐటీలో మరో ప్రధానమైన కంప్యూటర్ లాంగ్వేజ్.. పైథాన్. ముఖ్యంగా డేటాసైన్‌సలో అనలిటిక్స్, కోడింగ్‌కు పైథాన్ లాంగ్వేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో సీ, సీ++,జావా వంటి లాంగ్వేజ్‌ల కంటే ఎక్కువగా పైథాన్ డెవలపర్‌కు డిమాండ్ పెరుగుతోంది. పైథాన్ డెవలపర్స్ విభాగంలో రానున్న రెండేళ్లలో దాదాపు లక్షన్నర వరకు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ లాంగ్వేజ్ నైపుణ్యానికి సంబంధించి వీఎం వేర్, ఐబీఎం, సిస్కో వంటి సంస్థలు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా పైథాన్ డెవలపర్‌గా కొలువుదీరొచ్చు.
డెవాప్స్ :
సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. పలు రకాల మోడల్స్ ఆధారంగా సంస్థలు సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తుంటాయి. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఉపయోగపడే టెక్నాలజీయే డెవాప్స్. ఈ డెవాప్స్‌లో డెవలపర్స్, ఆపరేషన్‌స విభాగాల సభ్యులు కలిసి సంస్థ పనితీరు, ఉత్పత్తిదాయకత పెరిగేందుకు దోహదం చేస్తారు. డెవలపర్స్, సిస్టమ్ అడ్మిన్‌స, టెస్టర్స్.. మొదలైన వాళ్లందరూ డెవాప్స్ ఇంజనీర్లుగా కలిసి పనిచేస్తారు. డెవాప్స్ నైపుణ్యాలున్నవారు ప్రస్తుతం ఉద్యోగం పొందడం సులభం.
సైబర్ సెక్యూరిటీ :
సాఫ్ట్‌వేర్ రంగంలో.. ప్రాధాన్యం సంతరించుకుంటున్న విభాగం సైబర్ సెక్యూరిటీ. హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకునేలా ప్రోగ్రామింగ్ చేయడమే సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రధాన బాధ్యత. ఐటీ సేవలు అందించే సాఫ్ట్‌వేర్ సంస్థలు.. సదరు క్లయింట్‌ల వెబ్‌సైట్స్, ఈ-మెయిల్స్, ఇతర ఆన్‌లైన్ సర్వీసెస్ పరంగా సైబర్ భద్రత విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. డేటాసెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ మానిటరింగ్ విభాగాల్లో నైపుణ్యాలున్న అభ్యర్థులకు సంస్థలు ఎర్రతివాచీ స్వాగతం పలుకుతున్నాయి. పలు సంస్థల అంచనా ప్రకారం- ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడనుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీపై సిస్కో, ఈసీ కౌన్సిల్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ వంటి సంస్థల పలు కోర్సులు అందిస్తున్నాయి.
జావా :
ఐటీ రంగంలో జావా కంప్యూటర్ లాంగ్వేజ్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఎంతోకాలంగా జావా లాంగ్వేజ్‌దే అగ్రస్థానం. జావా నైపుణ్యాలుంటే.. మార్కెట్‌లో వచ్చే ఇతర టెక్నాలజీలను సులువుగా నేర్చుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఫ్రెషర్స్.. కోర్‌జావా, అడ్వాన్‌సడ్ జావాపై శిక్షణ పొందితే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతారుు. ముందుగా జావా స్క్రిప్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఫలితంగా ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కు సంబంధించి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. డెస్క్‌టాప్, గేమ్ డెవలప్‌మెంట్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ విభాగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి.
ఎంఎస్ ఎజ్యూర్ :
సాఫ్ట్‌వేర్ సంస్థల్లో క్లౌడ్‌టెక్నాలజీ, క్లౌడ్‌కంప్యూటింగ్ ఆధారిత సేవలు విస్తృతమవుతున్నాయి. దీనిద్వారా క్లయింట్ సంస్థలకు ఆన్‌లైన్ విధానంలోనే సేవలందించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ క్లౌడ్ సర్వీసెస్‌ల్లో ప్రధానమైంది.. ఎంఎస్ ఎజ్యూర్. మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ఎంఎస్ ఎజ్యూర్‌నే ఇప్పుడు అధిక శాతం సంస్థలు వినియోగిస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఆన్‌లైన్ ట్రైనింగ్ పేరుతో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తోంది. ఈ సర్టిఫికేషన్‌ను పూర్తి చేసుకుంటే.. సాఫ్ట్‌వేర్ సంస్థల్లో క్లౌడ్ సర్వీసెస్ విభాగంలో కొలువు సొంతం చేసుకోవచ్చు.
ఐఓటీ.. అవకాశాల తరంగం :
సాఫ్ట్‌వేర్ రంగంలో నియామకాల పరంగా డిమాండ్ నెలకొన్న మరో విభాగం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ). స్మార్ట్ డివైజ్, ఇంటర్నెట్ ద్వారా దూరం నుంచే కార్యకలాపాల నిర్వహణకు దోహదపడుతుంది ఐఓటీ. ఇంటర్నెట్ లేదా వైర్‌లెస్ సెన్సార్ల ఆధారంగా కమాండ్ ఇస్తే దానికి అనుగుణంగా ఉపకరణం పనిచేసే ప్రక్రియే ఐవోటీ. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని రంగాల్లో వినియోగంలోకి వస్తోంది. ఈ టెక్నాలజీకి రిటైల్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోని సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐవోటీ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు కోడింగ్, ప్రోగ్రామింగ్, డేటాఅనలిటిక్స్, అప్లికేషన్ డిజైన్, హార్డ్‌వేర్ నెట్ వర్కింగ్ విభాగాలు కీలకం. మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ ఇన్ ఐఓటీ; సిస్కో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్; ఐబీఎం వాట్సన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్; జెట్ కింగ్ ఐఓటీ సర్టిఫికేషన్ కోర్స్; సీసీఎన్‌ఏ సర్టిఫికేషన్‌ల ద్వారా ఐవోటీపై అవగాహన పెంచుకోవచ్చు.
క్లౌడ్ టెక్నాలజీ :
ఐటీ రంగంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటున్న టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్. ఐటీ సంస్థలు.. తమ క్లయింట్ సంస్థలకు ఇంటర్నెట్ ఆధారంగానే సర్వీసులు అందించేందుకు వీలు కల్పించేదే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్-ఎస్‌ఏఏఎస్ విధానంలో సేవలందించడానికి అందుకు అవసరమైన నిపుణులను నియమించు కోవడానికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్లౌడ్ టెక్నాలజీస్‌కు సంబంధించి ప్రస్తుతం కంపెనీలు క్లౌడ్ ఆర్కిటెక్ట్; క్లౌడ్ బిజినెస్ అనలిస్ట్; క్లౌడ్ నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్; క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్; క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజర్; క్లౌడ్ కన్సల్టెంట్; క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్; క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్; క్లౌడ్ నెట్‌వర్క్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు అందిస్తున్నాయి. అభ్యర్థులు ఈ్ఛఠిైఞట, ప్రోగ్రామింగ్; డేటాబేస్ మేనేజ్‌మెంట్; లినక్స్; సిస్టమ్ ఆటోమేషన్; క్వాలిటీ అష్యూరెన్స్; సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ విభాగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవడం ద్వారా క్లౌడ్ కొలువులు దక్కించుకోవచ్చు. ప్రస్తుతం వీఎం వేర్ క్లౌడ్; సర్టిఫికేషన్; ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్; ఈఎంసీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్; ఈఎంసీ వర్చువలైజ్డ్ డేటాసెంటర్ అండ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్; ఈఎంసీ క్లౌడ్ ఆర్కిటెక్ట్ వంటి కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యాంశాలు..
కొత్త టెక్నాలజీపై పట్టు సాధించాలి...
{పస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. విద్యార్థులు దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సదరు టెక్నాలజీపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇప్పుడు నాస్‌కామ్‌తోపాటు పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి. వాటిని పూర్తి చేసుకోవడం ద్వారా జాబ్ రెడీ స్కిల్స్‌తో ఇండస్ట్రీలో అడుగు పెట్టొచ్చు.
- సతీశ్ కుమార్, నాస్‌కామ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ మేనేజర్

- కీలకంగా మారుతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ
- ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఐఓటీలకు పెరుగుతున్న ప్రాధాన్యం
- రోబోటిక్స్, క్లౌడ్ సర్వీసెస్.. అన్ని రంగాలకు విస్తరణ.
- నైపుణ్యాలు పెంచుకునేందుకు అందుబాటులో అనేక మార్గాలు
- మైక్రోసాఫ్ట్, సిస్కో, ఐబీఎం, వీఎం వేర్‌ల ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్.
- కొత్త టెక్నాలజీ విభాగాల్లో కలిపి దాదాపు పది లక్షల మంది అవసరం.
- సగటున రూ.6లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షిక వేతనం.

#Tags