Job Opportunities with Five Courses : ఈ 5 కోర్సుల‌తో ఉపాధి అవ‌కాశాలు.. ఎక్క‌డంటే..!

యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీలో ఉపాధి దక్కేలా కొన్ని కోర్సులను ఏర్ప‌ర్చారు. తాజాగా, ఈ కోర్సుల‌కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించ‌డ‌మే లక్ష్యంగా ఈ వైఐఎస్‌యూ.. యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీలో ఉపాధి దక్కేలా కొన్ని కోర్సులను ఏర్ప‌ర్చారు. తాజాగా, ఈ కోర్సుల‌కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం, వ‌ర్సిటీలో మొత్తం ఐదు కోర్సులు ఉంటాయి. వీటిలో కొన్ని కోర్సుల్లో శిక్షణతో పాటు ఉపాధి అవ‌కాశం కూడా ఉంటుంది.

Work From Home Jobs: డిగ్రీ అర్హతతో Work From Home jobs జీతం నెలకు 18,000

ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరుతున్నారు వ‌ర్సిటీ యాజ‌మాన్యం. ఈ కోర్సుల్లో శిక్షణ సమయంలో స్టైపెండ్‌తో పాటు శిక్షణ పూర్తయ్యాక అయా సంబంధిత సంస్థల్లో ఉద్యోగాలను కూడా కల్పిస్తారు. ఇది యువ‌త‌కు, నిరుద్యోగుల‌కు ఒక గొప్ప అవ‌కాశం అనే చెప్పాలి.

కోర్సుల వివ‌రాల్లోకి వ‌స్తే..

1. స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్‌ అండ్ ఈ కామర్స్ (సప్లై చైన్ అసెన్షియల్స్‌ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం):

ఈ కోర్సు 11 వారాల పాటు కొన‌సాగుతుంది. ఇందులో 70 శాతం వర్చువల్, 30 శాతం క్లాస్ రూమ్‌ సెషన్లతో రెండు విభాగాల్లో శిక్ష‌ణ‌ను అందిస్తారు. ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు సొంతంగా ల్యాప్‌ టాప్‌ ఉండాలి.

కోర్సు.. ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు..

డిగ్రీని ఎటువంటి బ్యాక్‌లాగ్ లేకుండా పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో ప్ర‌వేశానికి అర్హులు. బిఇ, బిటెక్‌, ఎంసిఏ, ఎంబిఏతో పాటు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచిల విద్యార్థులకు ఇందులో దరఖాస్తులు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌వేశం కోసం రూ.15 వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఐటీ అనుబంధ సంస్థల్లో సప్లై ఛైన్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. o9 సొల్యూషన్స్ తో ప్లేస్‌మెంట్స్‌లో సాయం చేస్తారు. ఈ కోర్సు గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఈ లింకును అనుసరించండి. https://yisu.in/school-of-logistics-and-e-commerce-2

Punjab National Bank Jobs : ఇంటర్‌ డిగ్రీ అర్హతతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు జీతం నెలకు 64,480

2. అరబిందో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్ కోర్సు:

స్కిల్ యూనివర్శిటీ కోర్సుల్లో భాగంగా అరబిందో ఫార్మా భాగస్వామ్యంతో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్ కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సు నాలుగు నెలలపాటు సాగుతుంది. ప్ర‌వేశం పొందాల‌నుకునే వారు 2023, 2024 విద్యా సంవత్సరంలో బీఫార్మసీ డిగ్రీని తొలి ప్ర‌య‌త్నంలోనే పూర్తి చేసి ఉండాలి. కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన వారిని అనుమతించరు. పదో తరగతి నుంచి కనీసం 6.4 జిపిఏ కంటే ఎగువ మార్కులు సాధించిన వారే అర్హులు. అభ్య‌ర్థుల‌కు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో పట్టు ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. కోర్సులో చేరేందుకు ఫీజు కింద 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ కోర్సులో పూర్తి చేసే స‌మ‌యంలో 15 వేలు స్టైపెండ్‌గా ఇస్తారు. క్లాస్ రూమ్‌ సెషన్లతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్పిస్తారు. ఫార్మాస్యూటికల్స్‌పై ఎండ్‌ టూ ఎండ్ టెస్టింగ్ పై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సులో భాగంగా హైదరాబాద్‌, వైజాగ్, నాయుడుపేట, బివాండీలో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షతో పాటు టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి క్వాలిటీ అనలిస్ట్‌ ట్రైనీగా రూ.2.69లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తారు. గ్రూప్ మెడిక్లెయిమ్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, క్యాంటీన్ సదుపాయాలు కల్పిస్తారు. ఏడాది తర్వాత క్వాలిటీ అనలిస్ట్‌గా నియామకం కల్పిస్తారు. కోర్సు పూర్తైన తర్వాత క్వాలిటీ అనలిస్ట్‌ సర్టిఫికెషన్ అందిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://yisu.in/school-of-pharmaceuticals-and-lifesciences/ లింక్‌ను అనుస‌రించండి.

3. టీ వర్క్స్‌ ప్రో టైపింగ్ స్పెషలిస్ట్‌ కోర్స్:

వైఐఎస్‌యూలో ఈ కోర్సులో ప్ర‌వేశం పొందేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారి అర్హ‌త ఉంటుంది. వారికి రెండు నెలల శిక్షణతో టీ వర్క్స్ ప్రో టైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం అందిస్తారు. 18-25 ఏళ్ల మధ్య వయస్కులు ద‌ర‌ఖాస్తుల‌కు అర్హ‌లు. 

ఈ కోర్సులో డిజైన్ థింకింగ్, క్యాడ్, క్యామ్‌లపై అవగాహన, 3డి ప్రింటింగ్‌, వెల్డింగ్, సిఎన్‌సి మెషినింగ్, అడ్వాన్స్‌ ర్యాపిడ్ ప్రో టైపింగ్, ప్యాకెజింగ్, వుడ్, లేజర్ కటింగ్ వంటి అంశాలపై శిక్షణ కల్పిస్తారు. ఈ కోర్సులో అభ్యర్థులకు వర్క్‌మెన్‌ ఇన్స్యూరెన్స్‌, ఇండస్ట్రీ సర్టిఫికెషన్ లభిస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తారు. కనీసం రూ.15-20వేల వేతనాలు లభిస్తాయి. జూనియర్ ప్రోటైపింగ్‌ టెక్నిషియన్ ఉద్యోగాలు లభిస్తాయి.
మ‌రిన్ని వివ‌రాల‌కు https://yisu.in/t-works-prototyping-specialist-course/ లింక్‌ను అనుస‌రించండి.

DRDO Junior Research Fellow jobs: డిగ్రీ అర్హతతో DRDOలో పరీక్ష లేకుండా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు జీతం నెలకు 37,000

4. స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిఎఫ్‌ఎస్‌ఐ):

ఈ కోర్సులో చేరేందుకు బికాం, బిసిఏ, బిబిఏ, బిఎస్సీ స్టాటస్టిక్స్, మ్యాథ్స్‌, బికాం ఎకనామిక్స్‌, కంప్యూటర్స్‌లో 70 శాతం మార్కులు సాధించిన విద్యార్ధులు అర్హ‌లు. ఇందులో పూర్తిగా నాలుగు నెలల శిక్ష‌ణ ఉంటుంది. కంపార్ట్‌మెంట్‌లో పాసైన విద్యార్థుల్ని అనుమతించరు. 2023-24 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుకు రూ.5వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌, బ్యాంకింగ్‌ అనుబంధ రంగాలపై ఈ కోర్సులో శిక్షణ ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్‌, రెగ్యులేటరీ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ కంప్లయెన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ రంగాలపై అవగాహన కల్పిస్తారు. కోర్సులో ప్రవేశాలకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో నెగ్గాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు https://yisu.in/school-of-banking-financial-services-insurance-bfsi/ లింక్‌ను సంప్ర‌దించండి.

5. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్‌ అండ్ లైఫ్ సైన్సెస్ (అరబిందో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్ ప్రోగ్రాం):

ఈ కోర్సు ఆరు నెలల కాల వ్యవధి క‌లిగి ఉంది. ఇందుకు ఇంటర్‌ బైపీసీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్య‌ర్థులు 25 ఏళ్లలోపు వయస్కులై ఉండాలి. కోర్సులో భాగంగా ఎండోస్కోపీ పరీక్షలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఖాళీలను బట్టి ఏఐజీ ఆస్పత్రిలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఇతర ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సుకు రూ.10వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సు కోసం ఈ https://yisu.in/school-of-healthcare/#endoscopy-technician లింకును అనుసరించండి...

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags