దేహ దారుఢ్యానికి.. ఫిట్‌నెస్ ట్రైనింగ్
నేటి ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణ, దేహ దారుఢ్యంపై ప్రజల్లో ఎంతగానో అవగాహన పెరిగింది. అందుకే జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్ల బాటపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించు కొనేందుకు ఫిటినెస్ ట్రైనర్ సూచనలను పాటిస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటి యువతను అమితంగా ఆకర్షిస్తున్న అంశం... సిక్స్‌ప్యాక్ బాడీ. సినీ నటుల తరహాలో ఆరు ఫలకల దేహం కోసం జిమ్‌లలో చేరి, గంటల తరబడి కష్టపడుతున్నారు. ప్రజాదరణ లభిస్తుండడంతో ప్రతి గల్లీలో జిమ్‌లు వెలుస్తున్నాయి. వీటిలో శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ అనేది ఉద్యోగానికి, ఉపాధికి వంద శాతం భరోసా కల్పిస్తున్న కెరీర్‌గా గుర్తింపు పొందింది. ఇందులో అవకాశాలకు, ఆదాయానికి లోటు లేకపోవడంతో ఎంతోమంది ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు.
సెలబ్రిటీ ట్రైనర్లకు అధిక ఆదాయం
వ్యాయామ శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి. జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్లలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. ప్రారంభంలో ఏదైనా జిమ్‌లో పనిచేసి, తగిన అనుభవం సంపాదించుకున్న తర్వాత సొంతంగా జిమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మరోవైపు కార్పొరేట్ ఫిట్‌నెస్ సెంటర్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి. వీటిలో ట్రైనర్లకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. సినీ నటులు, ప్రముఖులు నెలకు రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తూ సొంత ట్రైనర్లను నియమించుకుంటు న్నారు. ఫిట్‌నెస్‌పై టీవీ ఛానళ్లలో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ప్రేక్షకుల సందేహాలకు ట్రైనర్లతో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. పత్రికలు, మ్యాగజైన్లలోనూ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ శీర్షికలు ప్రచురితమవుతున్నా యి. వీటన్నింటి వల్ల వ్యాయామ శిక్షకులకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి.
నైపుణ్యం కలిగిన శిక్షకులకు డిమాండ్
ఫిట్‌నెస్ ట్రైనర్‌గా రాణించాలంటే ముందు తన ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. బాడీ ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నైపుణ్యం కలిగిన ఇన్‌స్ట్రక్టర్లకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. కాబట్టి ఆసక్తి కలిగిన యువత ఈ రంగంలోకి నిస్సందేహంగా అడుగుపెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అర్హతలు: హెల్త్ అండ్ ఫిటినెస్ ట్రైనింగ్‌పై మనదేశంలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో వీటిలో చేరొచ్చు. ఫిటినెస్ శిక్షకులకు ప్రత్యేకంగా ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకపోయినా ఇలాంటి కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలు దక్కుతాయి.
వేతనాలు: జిమ్‌లో ఫిటినెస్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి నెలకు రూ.30 వేలకు పైగానే పొందొచ్చు. మోడళ్లు, సినిమా నటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేస్తే రూ.లక్షల్లో ఆదాయం ఉంటుంది.
ఫిటినెస్ ట్రైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

- సింబయోసిస్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్-పుణె,
వెబ్‌సైట్: www.schcpune.org
- ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిటినెస్ ట్రైనింగ్,
వెబ్‌సైట్: www.iaftworld.com
- యూనివర్సిటీ ఆఫ్ అలబామా,
వెబ్‌సైట్: www.ua.edu
ఫిట్‌నెస్ ట్రైనర్లకు భారీ డిమాండ్! ఫిట్‌నెస్.. ఆధునిక మానవుడి ఆరోగ్య సూత్రాల్లో భాగంగా మారిపోయింది. అధిక సంఖ్యలో జిమ్, ఫిట్‌నెస్ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులైన ఫిట్‌నెస్ ట్రైనర్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఫిట్‌నెట్ ట్రైనింగ్‌లో కొన్ని విదేశీ సంస్థలు సైతం సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో అర్హత పొంది జిమ్ కేంద్రాల్లో ఫిట్‌నెస్ శిక్ష కులుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఫిట్‌నెస్ కోర్సులకు ఇంకా గుర్తింపు రావాల్సి ఉంది. డిగ్రీ, పీజీ స్థాయిలోనూ యూనివర్సిటీలు ఈ కోర్సులను నిర్వహించాలి. అప్పుడే ఫిట్‌నెస్ కోర్సులపై ఏకరూపత ఏర్పడుతుంది. ఔషధాలు లేని ఎన్నో వ్యాధులకు ఫిట్‌నెట్ మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది. చాలా వ్యాధులకు డాక్టర్లు కూడా వ్యాయామం చేయాలని సూచిస్తుండడం తెలిసిందే. ఫిజియోథెరపిస్ట్‌లు, డాక్టర్లు, బాడీ బిల్డర్స్‌తోపాటు సైన్స్‌పై అవగాహన ఉన్న వారు ఫిట్‌నెట్ ట్రైనర్లుగా రాణిస్తున్నారు. - డా. ఎస్.భక్తియార్ చౌదరి డైరె క్టర్, హైదరాబాద్ స్పైన్ క్లినిక్స్, హైదరాబాద్ |
#Tags